Uttar Pradesh Terrorist Group: ఉత్తరప్రదేశ్ లో పాక్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముఠా అరెస్ట్

దేశంలో పలు ప్రాంతాల్లో దాడులకు కుట్రపన్నిన ఉగ్రముఠాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. లక్నో, ఘజియాబాద్ తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి, పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఒక సంస్థ వీరికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లక్నో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే సిగ్నల్ బాక్సును లక్ష్యం చేసుకోవడానికి మీరట్‌కు చెందిన సాకిబ్, మరో ముగ్గురు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాలకు చెందిన ఫొటోలు, వీడియోలను అక్కడి పరిస్థితులను ప్రధాన నిందితుడు సాకిబ్ ఎప్పటికప్పుడు పాక్ హ్యాండ్లర్‌కు చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
Uttar Pradesh Terrorist Group
Lucknow
ISI
Pakistan ISI
Terrorist Arrest
Ghaziabad
Saqib
Indian Railways

More Telugu News