KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఆదివారం ట్రయల్ రన్

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 5, ఆదివారం రోజున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (రెండు గంటల పాటు) కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

జీహెచ్ఎంసీ చేపట్టిన ఈ నిర్మాణ పనుల వల్ల భవిష్యత్తులో అమలు చేయబోయే శాశ్వత ట్రాఫిక్ మళ్లింపులకు సన్నద్ధమయ్యేందుకే ఈ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డెవిస్ తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా ట్రాఫిక్ సరళిని అధ్యయనం చేసి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు.

ట్రయల్ రన్ సమయంలో పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తారు. పంజాగుట్ట నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలు రోడ్ నెం. 2, ఇందిరానగర్, రోడ్ నెం. 5, 10 మీదుగా రోడ్ నెం. 45కు చేరుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా, మాదాపూర్ రోడ్ నెం. 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి కేబీఆర్ పార్క్ ముందుగా వన్-వేలో భాగంగా రోడ్ నెం. 2 వైపు అనుమతిస్తారు. ఈ రెండు గంటల పాటు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి తమకు సహకరించాలని వాహనదారులను అధికారులు కోరారు.
KBR Park
Hyderabad Traffic
Jubilee Hills
Traffic Diversions
Flyover Construction
Underpass Construction
Traffic Trial Run
GHMC
Joel Davis

More Telugu News