Sajjala Ramakrishna Reddy: అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల

రాజధానిపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు శాశ్వతంగా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమరావతి అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయన్నారు. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (మావిగన్) గ్రోత్ కారిడార్‌తోనే తక్కువ ఖర్చుతో నిజమైన అభివృద్ధి సాధ్యమని సజ్జల పునరుద్ఘాటించారు. ఈ ‘ప్లాన్-బీ’ ఆలోచనలను గ్రామస్థాయిలోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

నిన్న ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపైనా ఇతర విషయాలపైనా దిశానిర్దేశం చేశారు.  

తిరుమల పవిత్రతకు భంగం కలుగుతోందని ఆరోపిస్తూ, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చైర్మన్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే, ఓటర్ల జాబితాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సజ్జల ఆదేశించారు.
Sajjala Ramakrishna Reddy
YS Jagan Mohan Reddy
Amaravati
Machilipatnam Vijayawada Guntur
AP capital
Andhra Pradesh
TDP
BR Naidu
TTD Chairman

More Telugu News