టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న

Rashmika Mandanna to Present at Crunchyroll Anime Awards in Tokyo
  • ఈ వేడుకకు రెండోసారి ప్రజెంటర్‌గా హాజరవుతున్న రష్మిక
  • భారత్ నుంచి ఈ వేడుకకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ
  • టోక్యోలో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్
ప్రముఖ సినీ నటి రష్మిక మందన్న టోక్యోలో జరగనున్న క్రంచీరోల్ యానిమే అవార్డు-2026 ప్రదానోత్సవంలో పాల్గొనున్నారు. జపనీస్ యానిమేషన్‌కు సంబంధించిన పేరుగాంచిన ఈ వార్షిక వేడుకకు ఆమె ప్రజెంటర్‌గా ఖరారయ్యారు. రష్మిక ప్రజెంటర్‌గా హాజరు కావడం ఇది రెండోసారి. మొదటిసారి 2024లో హాజరయ్యారు. భారత్ నుంచి ఈ అవార్డుల వేడుకకు వెళ్లిన మొదటి సినిమా సెలబ్రిటీగా నిలిచారు.

క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ మే 23న టోక్యోలోని గ్రాండ్ ప్రిన్స్ హోటల్ షిన్ టకనావాలో జరగనుంది. ఈ వేడుక కోసం వివిధ దేశాలకు చెందిన తారలతో కూడిన ప్రజెంటర్ల జాబితాను రూపొందించారు. జపనీస్ నటి అసుకా సైటో, మెక్సికన్ గాయని మరియు నటి డానా, ప్రఖ్యాత కాస్‌‍ప్లేయర్ ఎనాకో, ఆస్ట్రేలియన్ గాయని మరియు గేయరచయిత్రి హన్నా బాంగ్, నటి కసుమి అరిమురా, నటి నానాసే నిషినో, హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్‌లతో కూడిన మొదటి విడత ప్రజెంటర్ల జాబితా బృందంలో రష్మిక మందన్న కూడా చేరారు.

జపాన్ యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, వాటిలో సత్తా చాటిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు క్రంచీరోల్ యానిమే అవార్డులు ఇస్తారు. ప్రజెంటర్లుగా వీరంతా వేదికపై విజేతల వివరాలను ప్రకటించి, వారికి అవార్డులను అందజేస్తారు.
Advertisement
Rashmika Mandanna
Crunchyroll Anime Awards
Tokyo
Japanese Animation
Anime Awards 2026

More Telugu News