Ayush Matre: ఆయుష్ మాత్రే సూపర్.. దూబే, సర్ఫరాజ్ మెరుపులు.. చెన్నై భారీ స్కోరు
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు విజృంభించారు. దాంతో, చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే (73) అద్భుత హాఫ్ సెంచరీతో కదం తొక్కగా, శివమ్ దూబే (45*), సర్ఫరాజ్ ఖాన్ (32) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే చెన్నైకి షాక్ తగిలింది. సంజూ శాంసన్ (7) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28)తో కలిసి ఆయుష్ మాత్రే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ముఖ్యంగా మాత్రే తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగాడు.
గైక్వాడ్, మాత్రే స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసి స్కోరు బోర్డుకు ఊపు తెచ్చాడు. మరోవైపు, శివమ్ దూబే చివరి వరకు అజేయంగా నిలిచి 28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు సాధించాడు.
పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్ 38 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. యజువేంద్ర చాహల్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్‌లకు తలో వికెట్ దక్కింది. అయితే, బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్ కింగ్స్ ముందు చెన్నై 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.