Donald Trump: హర్మూజ్ జలసంధిని తెరవగలిగితే ఇక చమురు వెల్లువే!: ట్రంప్

Donald Trump Says Opening Hormuz Strait Could Unleash Oil Wealth
షార్ట్స్‌లో చూడండి
గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచి, చమురుతో భారీగా సంపద సృష్టించవచ్చని ఆయన అన్నారు. ఇది ప్రపంచానికి ఒక 'జాక్‌పాట్' అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

"మరికొంత సమయం ఇస్తే, మనం సులభంగా హర్మూజ్ జలసంధిని తెరవవచ్చు, చమురును తీసుకోవచ్చు, భారీగా సంపద కూడబెట్టవచ్చు. ఇది ప్రపంచానికి ఒక వరం అవుతుంది కదా?" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు వెలువడుతున్న తరుణంలోనే, సముద్రయాన ఇంటెలిజెన్స్ సంస్థ 'విండ్‌వార్డ్' తాజా డేటాను విడుదల చేసింది. ఏప్రిల్ 1న 16 నౌకలు ఈ జలసంధిని దాటాయని, అంతరాయం తర్వాత నౌకల రాకపోకలు జరగడం ఇది వరుసగా మూడో రోజని తెలిపింది.

గత మార్చి మధ్యలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పర్యవేక్షణలో తప్పనిసరి నావిగేషన్ కారిడార్‌ను అమలులోకి తెచ్చింది. దీంతో అనేక నౌకలు తమ మార్గాలను మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, ఇటీవల ఒమన్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లు, సోహార్ అనే ఒక ఎల్‌ఎన్‌జీ క్యారియర్.. ఇరాన్ నియంత్రిత మార్గాన్ని తప్పించుకుని అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాయి. ఉద్రిక్తతలు పెరిగాక ఈ జలసంధిని దాటిన తొలి ఎల్‌ఎన్‌జీ క్యారియర్ ఇదే కావడం గమనార్హం.

ఫ్రాన్స్‌కు చెందిన సీజీఏం సంస్థకు సంబంధించిన ఒక కంటైనర్ నౌక కూడా ఈ మార్గం గుండా ప్రయాణించింది. ఆంక్షల తర్వాత ఒక పాశ్చాత్య దేశానికి చెందిన నౌక ప్రయాణించడం ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 25 శాతం నౌకల యజమానుల వివరాలు తెలియకపోవడం నిఘాను సంక్లిష్టంగా మారుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
Go Back to Shorts
Donald Trump
Hormuz Strait
oil
Iran
Oman
Persian Gulf
maritime security
IRGC
LNG carrier
maritime intelligence

More Telugu News