Revanth Reddy: కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి
ఆరు గ్యారెంటీల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంగా గొప్పలు పలికారని, మున్ముందు తెలంగాణలోనూ ఇదే తరహా మాటలు చెప్పే ప్రమాదం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బీజేపీపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందిస్తూ, కేరళ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. కానీ రెండున్నరేళ్లు కావొస్తున్నా ఎన్ని హామీలు నెరవేర్చిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏం చేశారని రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లి గొప్పలు చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు.
తెలంగాణ వచ్చాక పదేళ్ల పాటు కేసీఆర్ ప్రజలను మోసం చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు ఏదో చేశామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, అదేమిటో చెప్పాలని ప్రశ్నించారు. హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు.