Raghurama Krishnam Raju: ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యంత ఘాటైన పదజాలంతో, వ్యక్తిగత విమర్శలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "గేదెలా పెరిగావ్, నీకు సంస్కారం లేదా? మీ అమ్మానాన్న నీకు నేర్పించలేదా?" అంటూ రఘురామను ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన వస్త్రధారణపై రఘురామ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సునీల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. "నేను వేసుకున్న కోటు గురించి మాట్లాడటానికి నువ్వెవరు? నీ సొమ్ములతో ఏమైనా కొనిచ్చావా? 'వాడు, వీడు' అని మాట్లాడతావా? గోదావరి జిల్లాల్లో... పనిచేసే వాళ్లను కూడా 'బాబు' అని గౌరవంగా పిలుస్తారు. ఆ సంస్కారం కూడా నీకు లేదా?" అని ప్రశ్నించారు. "పొద్దున లేస్తే బ్యాంకులను మోసం చేస్తే గానీ నువ్వు బతకలేవు!" అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

రఘురామ తన చుట్టూ ఎంగిలి మెతుకులు తినే కుక్కలను తయారు చేసుకున్నాడని, ఆయనకు మద్దతిచ్చే రెండు ఛానళ్లను ఎవరూ పట్టించుకోరని అన్నారు. "నువ్వెంత, నీ బతుకెంత? సంస్కారం, హద్దులు దాటి మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఈసారి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేదంటే నేను కూడా తిట్టాల్సి ఉంటుంది... మాట్లాడడం మాకూ వచ్చు" అని సునీల్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.
Raghurama Krishnam Raju
IPS Sunil Kumar
AP Deputy Speaker
Andhra Pradesh Politics
Defamation
Political Controversy
Criticism
Bank Fraud
YSRCP
Godavari Districts

More Telugu News