Tina Ambani: నా రెండో తల్లిని కోల్పోయాను: అనిల్ అంబానీ భార్య టీనా

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ భార్య, మాజీ బాలీవుడ్ నటి టీనా అంబానీ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె పెద్ద సోదరి జన్హా కన్నుమూశారు. తన సోదరి మరణంతో టీనా అంబానీ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పెట్టిన భావోద్వేగభరిత పోస్ట్ వైరల్ అవుతోంది.


తన సోదరి జన్హాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ టీనా అంబానీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అరుదైన ఫొటోలను పంచుకున్నారు. ఆమె తమ కుటుంబానికి కేవలం సోదరి మాత్రమే కాదని, ఒక తల్లిలాంటి మార్గదర్శి అని కొనియాడారు.


"నా పెద్దక్క జన్హా నాకు రెండో తల్లి వంటిది. నా పెళ్లి సమయంలో ఆమె స్వయంగా కన్యాదానం చేసి, నన్ను మెట్టినింటికి సాగనంపింది. మా కుటుంబం మొత్తానికి ఆమె ఒక ముఖ్యమైన ధ్రువతార" అని టీనా పేర్కొన్నారు. ఆమె గ్రేస్, ఎనర్జీ తమ సోదరీమణులకే కాకుండా, పిల్లలకు, మనవళ్లకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చేవని గుర్తుచేసుకున్నారు.


"మీరు వెళ్ళిపోయి మా జీవితాల్లో ఎప్పటికీ పూడ్చలేని వెలితిని మిగిల్చారు. మీ ప్రేమ తరతరాలకు వారసత్వంగా నిలుస్తుంది. ఓం శాంతి" అంటూ తన సోదరికి నివాళులర్పించారు. ఈ పోస్ట్ చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు టీనా అంబానీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


టీనా మునిమ్ ఒకప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రాణించారు. 1978లో ‘దేశ్ పరదేశ్’తో కెరీర్ ప్రారంభించారు. కర్జ్, రాకీ, పుకార్ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. 1991లో అనిల్ అంబానీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆమె చివరి చిత్రం ‘జిగర్‌వాలా’. ప్రస్తుతం టీనా అంబానీ తన సోదరిని కోల్పోయిన బాధలో ఉండటంతో, అంబానీ కుటుంబ సభ్యులు ఆమెకు అండగా నిలుస్తున్నారు.
Tina Ambani
Janhvi
Anil Ambani
Bollywood actress
Sister death
Condolences
Family loss
Tina Munim
Desh Pardesh
Bollywood

More Telugu News