Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో హైడ్రామా: చేతులెత్తేసిన సీఐడీ, ఎస్పీ.. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డిపై లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ వ్యవహారం తీవ్ర గందరగోళానికి, నాటకీయ పరిణామాలకు దారితీసింది. ఆయనపై ఎల్‌వోసీ జారీ చేయాలని తాము కోరలేదని సీఐడీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ కోర్టులో చేతులెత్తేయగా, వారి అభ్యర్థన మేరకే సర్క్యులర్ జారీ చేశామని, అందుకు ఈ-మెయిల్ ఆధారాలున్నాయని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్పష్టం చేసింది. ఈ పరస్పర విరుద్ధమైన వాదనలతో అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది నిర్లక్ష్యం కాదు, లెక్కలేనితనం అని ఘాటుగా వ్యాఖ్యానించింది.
తనపై జారీ అయిన ఎల్‌వోసీని రద్దు చేయాలని కోరుతూ సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్‌వోసీ జారీపై అధికారుల మధ్య సమన్వయ లోపం, దాటవేత ధోరణి స్పష్టంగా కనిపించింది. "భార్గవరెడ్డిపై ఎల్‌వోసీ కోసం మేం ప్రతిపాదించలేదు" అని అన్నమయ్య ఎస్పీ, సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. దీనిపై ఇమ్మిగ్రేషన్ బ్యూరో తరఫు న్యాయవాది స్పందిస్తూ "అన్నమయ్య ఎస్పీ, సీఐడీ అదనపు డీజీ కోరిన మీదటే ఎల్‌వోసీ జారీ చేశాం. మా వద్ద పక్కా ఆధారాలున్నాయి" అని కోర్టుకు నివేదించారు.
ఈ గందరగోళంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలన్న ఆదేశాలను డీజీపీ, కేంద్ర హోంశాఖ, పలు జిల్లాల ఎస్పీలు పాటించకపోవడాన్ని తప్పుబట్టారు. ఎస్పీని అఫిడవిట్ వేయమంటే, ఇన్‌స్పెక్టర్‌తో వేయించడం ఏమిటని నిలదీశారు. "గతంలో అధికారులది నిర్లక్ష్యమైతే, ఇప్పుడు అది లెక్కలేనితనంగా మారింది. ప్రభుత్వ లీగల్ టీమ్‌లో కొందరి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తోంది. ఇలాంటి వైఖరిని ఉపేక్షించబోం" అని జస్టిస్ దేవానంద్ నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా వాక్ స్వాతంత్ర్యంపైనా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "సోషల్ మీడియాలో వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరుల ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే సహించబోం. అదే సమయంలో, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. బాధితులు ఏ పార్టీ వారైనా వారి హక్కులను కాపాడతాం" అని స్పష్టం చేసింది.
కౌంటర్లు దాఖలు చేసేందుకు ఇదే చివరి అవకాశమని, లేనిపక్షంలో డీజీపీ, సంబంధిత ఎస్పీలు తదుపరి విచారణకు స్వయంగా హాజరుకావాల్సిందేనని అల్టిమేటం జారీ చేస్తూ, విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.