Donald Trump: అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్

Iran responds strongly to Trumps comments on surrender
షార్ట్స్‌లో చూడండి
అమెరికా తమకు లొంగిపోయేవరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ట్రంప్ చెప్పినట్లుగా తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని పేర్కొంది. అమెరికా అవమానానికి గురై, పశ్చాత్తాపపడి, లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ప్రకటన చేయగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదని పేర్కొంది.

వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటు సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామని ట్రంప్ చేసిన వాదనలను ఇరాన్ ఖండించింది. అమెరికా రాతి యుగం నాటి నేరాలను ఆధునిక యుగానికి తీసుకువస్తోందని ఆరోపించింది. చిన్నారుల హత్యలు, మానవత్వానికి మచ్చతెచ్చే నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది.
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran relations
Iran military
Iran war
America
Military strength
Strategic capabilities

More Telugu News