Fly91 Airlines: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే!
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే వారికి శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ సర్వీసులను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు.
మొదటి సర్వీసు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 6:05 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి 7:10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరిగి విజయవాడ నుంచి ఉదయం 7:30 గంటలకు బయలుదేరి 8:40 గంటలకు హైదరాబాద్‌లో దిగుతుంది. ఇక, రెండో సర్వీసు ఈ నెల 17 నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ విమానం ఉదయం 10:10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 11:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని డైరెక్టర్ వివరించారు.
ఈ కొత్త సర్వీసుల్లో ప్రయాణ చార్జీలు రూ.4,000 నుంచి రూ.8,000 మధ్య ఉంటాయని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉడాన్ పథకం ద్వారా ప్రధాన నగరాల మధ్య విమానయాన అనుసంధానం పెరుగుతోందని, దీనిలో భాగంగానే రాష్ట్రంలోని కడప, కర్నూలు విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.