Narayanapet: నారాయణపేటలో కలకలం.. చెరువుగట్టున నాలుగేళ్ల చిన్నారి మృతదేహం
నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైంది. అమ్మిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హతమార్చి, మృతదేహాన్ని గ్రామ సమీపంలోని చెరువుగట్టు వద్ద పడేసి వెళ్లారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువు సమీపంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించి, పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
చిన్నారి తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. దీంతో పాప తన అవ్వాతాతల సంరక్షణలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్నారి హత్యకు గురవ్వడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.