Tank Bund Shiva: రియల్ హీరో ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వ భరోసా.. రూ.5 లక్షల సాయం.. కొడుక్కి కొలువు
హుస్సేన్ సాగర్‌లో ప్రమాదవశాత్తు పడిన వందలాది మంది ప్రాణాలను కాపాడి 'రియల్ హీరో'గా, 'ట్యాంక్ బండ్ శివ'గా పేరుగాంచిన ఆపద్బాంధవుడికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శివ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి వారికి భరోసా కల్పించారు. శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
వివిధ కారణాలతో హుస్సేన్ సాగర్‌లో దూకిన వారిని కాపాడి ట్యాంక్ బండ్ శివగా గుర్తింపు పొందినప్పటికీ, కుటుంబ పోషణకు ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి, మంగళవారం శివ కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకుని మాట్లాడారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు. ప్రభుత్వం అందించిన రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని వారికి అందించారు.
ఈ భేటీ సందర్భంగా తనకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు ట్యాంక్ బండ్ వద్ద ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ ముఖ్యమంత్రిని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈతలో శివ మరికొంతమంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక శివ కుటుంబానికి సొంత ఇల్లు లేదని తెలుసుకుని, వారికి డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.
తమ సమస్యలపై తక్షణమే స్పందించి అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ట్యాంక్ బండ్ శివ, ఆయన కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందించిన ఈ చేయూత తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, సీఎం చేతుల మీదుగా సాయం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.