Mega Family: ఒకే ఫ్రేమ్‌లో మెగా ఫ్యామిలీ మహిళలు.. అన్నా లెజినోవా షేర్ చేసిన అరుదైన ఫొటో!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచినప్పటి నుంచి ఆమె మెగా కుటుంబానికి సంబంధించిన పలు అరుదైన ఫొటోలను పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో మెగా కుటుంబంలోని మహిళలందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమే దీనికి కారణం.

ఒక కుటుంబ వేడుక సందర్భంగా తీసిన ఈ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు అర్ధాంగి పద్మజ, అన్నా లెజినోవా ఉన్నారు. వారితో పాటు చిరంజీవి సోదరీమణులు విజయదుర్గ, మాధవి రావు కూడా ఉన్నారు. మెగా కుటుంబంలోని కోడళ్లు, ఆడపడుచులు ఇలా అందరూ కలిసి ఒకే ఫొటోలో కనిపించడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో ఈ ఫొటో నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రాన్ని చూసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'మెగా లేడీస్ పవర్ ప్యాక్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
Mega Family
Anna Lezhneva
Pawan Kalyan
Chiranjeevi
Surekha Chiranjeevi
Anjana Devi
Padmaja Nagababu
Vijay Durga
Madhavi Rao
Telugu Cinema

More Telugu News