Chinmay Gowda: కర్ణాటకలో మందారపువ్వు తిని ఆరున్నర నెలల చిన్నారి మృతి

కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద సంఘటనలో, ఇంట్లో ఉంచిన మందారపువ్వు గొంతులో ఇరుక్కోవడంతో ఆరున్నర నెలల పసికందు మృతి చెందాడు. హున్సూర్ తాలుకా హనగోడు హోబలి దొడ్డ హెజ్జూరు గ్రామంలో సుదర్శన్, నవ్య దంపతుల రెండో కుమారుడు చిన్మయ్ గౌడ ఆహారపదార్థంగా భావించి మందారపువ్వు దిగువ ఉన్న కాండాన్ని తిన్నాడు.

ఇది ప్రమాదవశాత్తు గొంతులో ఇరుక్కుపోయింది. దీనిని తీయడానికి చిన్నారి సోదరి ప్రయత్నించింది. పెద్దవారికి విషయం తెలియడంతో స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెప్పడంతో మైసూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. హున్సూర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Chinmay Gowda
Karnataka
Infant death
Hibiscus flower
Hunsur
Toddler accident
Chinnari death

More Telugu News