Nirmala Sitharaman: లాకర్లలోని వస్తువులను బ్యాంకులు చూడవు, రికార్డు చేయవు: నిర్మలా సీతారామన్

వినియోగదారులు లాకర్లలో ఉంచే విలువైన వస్తువులను బ్యాంకులు చూడలేవని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని చూడటం లేదా రికార్డు చేయడం బ్యాంకింగ్ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన విలువైన వస్తువుల బీమా కవరేజీ అంశంపై ఆమె మాట్లాడారు. వస్తువుల ఆధారంగా బీమా కవరేజీ ఉంటుందనే వాదనను ఆమె తోసిపుచ్చారు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం దొంగతనం, అగ్నిప్రమాదం, బ్యాంకుల్లో మోసాలు వంటి సందర్భాల్లో నష్టం వాటిల్లితే పరిహారం అందిస్తాయని అన్నారు. లాకర్ వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారాన్ని బ్యాంకులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. కానీ లాకర్లలోని వస్తువులను బ్యాంకులు తనిఖీ చేయలేవు కాబట్టి విలువ ఆధారంగా పరిహారం చెల్లించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి బీమా కవరేజీకి సంబంధించి కొత్త ప్రతిపాదనలేవీ పరిశీలనలో లేవని స్పష్టం చేశారు.
Nirmala Sitharaman
Bank Lockers
RBI Guidelines
Bank Locker Insurance
Locker Compensation

More Telugu News