Wedding Brawl: బిర్యానీలో లెగ్ పీస్ చిచ్చు.. పెళ్లి పందిట్లో కొట్టుకున్న బంధువులు.. వీడియో ఇదిగో!

ఉత్తరప్రదేశ్‌లో ఒక పెళ్లి వేడుక రణరంగాన్ని తలపించింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ వడ్డించలేదన్న చిన్న కారణంతో బంధువులు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. అమ్రోహా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. అమ్రోహాలోని ఒక వెడ్డింగ్ హాల్‌లో వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కొందరు అతిథులకు వడ్డించిన బిర్యానీలో లెగ్ పీసులు లేకపోవడంతో వారు క్యాటరింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాట పెరగడంతో పరిస్థితి చేయి దాటింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇరువర్గాల వారు అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీలను ఒకరిపై ఒకరు విసురుకోవడం ప్రారంభించారు.

ఈ గొడవతో పెళ్లికి వచ్చిన మిగతా వారు భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. కేవలం ఒక చికెన్ ముక్క కోసం పెళ్లి వేడుకలో ఇంతటి గొడవ జరగడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Wedding Brawl
Uttar Pradesh Wedding
Amroha
Chicken Leg Piece
Biryani Fight
Wedding Fight Video
Indian Weddings
Viral Video
Catering Dispute

More Telugu News