Anushka Sharma: ఐపీఎల్‌ మ్యాచ్‌కు అనుష్క శర్మ.. ఆమె ధ‌రించిన డ్రెస్‌ చూడటానికి సింపుల్‌గా ఉన్నా.. ధర తెలిస్తే షాకే!

ఐపీఎల్‌ మ్యాచ్‌లు కేవలం క్రికెట్ అభిమానులకే కాదు, ఫ్యాషన్ ప్రియులకు కూడా కనులవిందు చేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల సందడి, వారి స్టైల్ స్టేట్‌మెంట్లు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధించగా, విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అందరి దృష్టినీ అంతకుమించి ఆకర్షించింది మాత్రం అనుష్క ధరించిన సింపుల్ డ్రెస్.

చూడటానికి చాలా సాధారణంగా కనిపించినా, ఆ డ్రెస్ ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మ్యాచ్ కోసం అనుష్క ఒక అందమైన ఫ్లోరల్ టాప్, బ్లూ జీన్స్ ధరించింది. చూడటానికి క్యాజువల్‌గా ఉన్న ఈ అవుట్‌ఫిట్ వెనుక పెద్ద బ్రాండ్లే ఉన్నాయి. ఆమె వేసుకున్న పీచ్ కలర్ ఫ్లోరల్ టాప్, ప్రముఖ పారిసియన్ లేబుల్ 'సెజానే' (Sezane) బ్రాండ్‌కు చెందింది. ఈ టాప్ అధికారిక వెబ్‌సైట్‌లో దీని ధర 150 యూరోలుగా ఉంది. మన కరెన్సీలో దీని విలువ సుమారు రూ.16,361. V-నెక్, పొడవాటి చేతులు, అందమైన రఫుల్స్‌తో ఈ టాప్ చాలా స్టైలిష్‌గా ఉంది.

ఇక, ఆమె ధరించిన జీన్స్ విషయానికొస్తే, అది 'శాండ్రో' (Sandro) బ్రాండ్‌కు చెందిన ఫేడెడ్ బ్యారెల్ జీన్స్. సౌకర్యవంతంగా ఉండే ఈ హై-వెస్ట్ జీన్స్ ధర 239 పౌండ్లు. అంటే, భారత కరెన్సీలో దాదాపు రూ.29,925. ఇలా కేవలం టాప్, జీన్స్ కోసమే అనుష్క రూ.46,000 పైగా ఖర్చు చేసింది.

కేవలం ఖరీదైన దుస్తులు ధరించడమే కాదు, వాటిని ఎలా స్టైల్ చేసుకోవాలో కూడా అనుష్క చూపించింది. ఈ సింపుల్ డ్రెస్‌కు మ్యాచింగ్‌గా లేయర్డ్ గోల్డ్ నెక్లెస్, చేతికి బ్రాస్‌లెట్, వాచ్, కొన్ని ఉంగరాలు ధరించింది. సింపుల్ మేకప్, పింక్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ను పూర్తి చేసింది. దీంతో సాధారణంగా కనిపించే డ్రెస్ కూడా ఎంతో క్లాసీగా మారిపోయింది. ప్రస్తుతం అనుష్క స్టైల్, ఆమె డ్రెస్ ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Anushka Sharma
Virat Kohli
IPL
Royal Challengers Bangalore
RCB
Sezane
Sandro
Floral Top
Celebrity Fashion
Womens Fashion

More Telugu News