Ishaq Dar: ఈజిప్ట్ మంత్రికి స్వాగతం పలుకుతూ కిందపడ్డ పాక్ ఉప ప్రధాని.. వీడియో ఇదిగో!
పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విదేశాంగ శాఖ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్‌పై ఈజిప్ట్ మంత్రి బదర్ అబ్దెలట్టికి స్వాగతం పలికేందుకు ఇషాక్ దార్ వేగంగా నడుస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆయన అదుపు తప్పి పడిపోగానే, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, అధికారులు వెంటనే ఆయన్ను పైకి లేపారు. ఈ దృశ్యాలన్నీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
ఈ ప్రమాదంలో ఇషాక్ దార్ భుజానికి 'హెయిర్‌లైన్ ఫ్రాక్చర్' అయినట్లు ఆయన కుమారుడు అలీ దార్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. భుజం నొప్పి ఉన్నప్పటికీ, దార్ పెయిన్‌కిల్లర్లు తీసుకుని రోజంతా జరిగిన కీలక ద్వైపాక్షిక, దౌత్యపరమైన సమావేశాల్లో పాల్గొన్నారని తెలిపారు.
పశ్చిమాసియాలో, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ ఈ శాంతి చర్చలకు ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశంలో ఈజిప్ట్, తుర్కియే, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, చమురు రవాణా పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.