IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. విశాఖ, గుంటూరుకు కొత్త కలెక్టర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పాలనలో కీలక మార్పులు చేసింది. 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో భాగంగా విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు.
విశాఖపట్నం జిల్లా నూతన కలెక్టర్‌గా ముట్టింబాకు అభిషిక్త్ కిషోర్ (2015 బ్యాచ్), గుంటూరు జిల్లా కలెక్టర్‌గా సి.ఎం. సైకాంత్ వర్మ (2015) బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటివరకు విశాఖ కలెక్టర్‌గా ఉన్న ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను కాకినాడ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న నిశాంతి టి (2017) పదోన్నతిపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
ఇప్పటివరకు కాకినాడ కలెక్టర్‌గా ఉన్న సగిలి షాన్ మోహన్‌ను ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన దినేష్ కుమార్ ఎ.ఎస్‌ను ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. గుంటూరు కలెక్టర్‌గా ఉన్న తమీమ్ అన్సారియాను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ పోస్టుకు తాత్కాలిక (ఎఫ్ఏసీ) ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.