Tirumala: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమల శ్రీవారి దర్శనానికి నిన్న భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లుగా నమోదైంది. అలాగే, 31,606 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుందని అంచనా.