Telangana Chicken Shop Owners Association: మాంసం ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్

Telangana Chicken Shop Owners Association Announces Chicken Shop Closures From April 1
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో మాంసం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి తమను నష్టాలకు గురిచేస్తున్నాయని ఆరోపిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా బంద్ పాటించాలని తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్‌కు మద్దతు ప్రకటించారు.

ఘట్‌కేసర్‌లోని గురుకుల్ కళాశాల మైదానంలో నిన్న చికెన్ సెంటర్ల నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పౌల్ట్రీ కంపెనీలు తమకు రావాల్సిన మార్జిన్‌ను ఏకపక్షంగా తగ్గించి దౌర్జన్యానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల వ్యాపారం చేయడం కష్టంగా మారిందన్నారు.

తగ్గించిన మార్జిన్‌ను తిరిగి సవరించి, తమకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ బంద్‌లో రాష్ట్రంలోని అన్ని చికెన్ సెంటర్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ సమావేశంలో చికెన్ సెంటర్ల నిర్వాహకులు సభాపతి, కాజా తదితరులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Telangana Chicken Shop Owners Association
Telangana
chicken shops
chicken sales
poultry companies
Ghatkesar
chicken prices
meat lovers
chicken shop owners
strike

More Telugu News