Konda Surekha: ఎమ్మెల్యేలకు క్రీడాపోటీలు.. లెమన్ అండ్ స్పూన్ పోటీలో కొండా సురేఖకు మొదటి బహుమతి

హైదరాబాద్‌లోని ఎల్బీ  స్టేడియంలో 'స్పోర్ట్స్, కల్చరల్ మీట్-2026' పేరిట నిర్వహిస్తున్న పోటీలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు హాజరయ్యారు.

స్టేడియంలో నిర్వహించిన ఫుట్‌బాల్ పోటీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని అందరిలో జోష్ నింపారు. లెమన్ అండ్ స్పూన్ పోటీలో మంత్రి కొండా సురేఖ మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, రాగమయి, రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

ఈ పోటీల్లో ప్రజాప్రతినిధులు అద్భుతమైన క్రీడా నైపుణ్యం ప్రదర్శిస్తారని తాను చెప్పడం లేదని, కానీ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడానికి ఈ ఎల్బీ స్టేడియం వేదిక అవుతోందని అన్నారు. ఈ మైదానంలో శిక్షణ పొందినవారు ఎందరో ఉన్నారని అన్నారు. తన మంత్రివర్గంలో, దేశానికి వన్నెతెచ్చిన అజారుద్దీన్ (మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి), రంజీ వరకు ఆడిన వాకిటి శ్రీహరి (క్రీడాశాఖ మంత్రి) ఉన్నారని చెప్పారు.
Konda Surekha
Revanth Reddy
Telangana MLAs
Sports Cultural Meet 2026
LB Stadium Hyderabad

More Telugu News