Narendra Modi: మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మధ్యలో ఎలాన్ మస్క్ జాయిన్ అయ్యారా? భారత్ ఏమన్నదంటే?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ట్రంప్, మోదీ మాట్లాడుకుంటుండగా, మధ్యలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా జాయిన్ అయినట్లు మీడియా, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. మోదీ, ట్రంప్ ఫోన్ కాల్ మాట్లాడుతుండగా, మస్క్ కూడా జాయిన్ అయ్యారని జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

ఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ విషయం తమ దృష్టికివచ్చిందని తెలిపింది. మార్చి 24న మోదీ, ట్రంప్ మాత్రమే ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరాన్‌, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన అనంతరం మోదీ, ట్రంప్ మధ్య ఈ సంభాషణే మొదటిది. అయితే ఈ చర్చలోకి మూడో వ్యక్తి రాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.  పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ, ట్రంప్ చర్చించాలని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచాల్సిన అవశ్యకతపై వారు మాట్లాడుకున్నారని వెల్లడించారు.

సున్నితమైన జాతీయ భద్రతా సమస్యలపై ఇద్దరు దేశాధినేతలు చర్చించుకుంటుండగా, మస్క్ ఆ కాల్‌లో జాయిన్ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఒక పౌరుడు పాల్గొనడం అసాధారణమని ఆ కథనంలో పేర్కొంది. దీనితో భారత ప్రభుత్వం స్పందించింది.
Narendra Modi
Donald Trump
Elon Musk
India
United States
West Asia tensions
Iran
Israel

More Telugu News