Nara Lokesh: ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు: నారా లోకేశ్

అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం కేవలం రాజధాని రైతులకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శాసనసభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో మీడియా చిట్‌చాట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే... వైసీపీ అధినేత జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారని విమర్శించారు. 

“జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెబితే... ఉదయాన్నే జగన్ అదే మాట్లాడతాడు” అని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఏ ఆత్మతో మాట్లాడి ఏం చెబుతాడోనని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. పరామర్శల పేరుతో వివాదాలు సృష్టిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రమే రాజధానిపై చర్చించే అర్హత ఉందని అన్నారు. “సజ్జల వంటి వ్యక్తులు అమరావతి గురించి మాట్లాడితే... వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలి” అని చెప్పారు.

వైసీపీ హయాంలో జగన్ పర్యటనల సమయంలో... పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం వంటివి ఇప్పుడు లేవని, ప్రజలు హ్యాపీగా ఉన్నారని లోకేశ్ అన్నారు. గతంలో ఇలాంటి ప్రోటోకాల్ ఎక్కువగా ఉపయోగించేవారని, ఇప్పుడు కేవలం అవసరమైన ప్రోటోకాల్ మాత్రమే కొనసాగుతోందని చెప్పారు.

Nara Lokesh
Amaravati
YS Jagan
Andhra Pradesh Assembly
Legal Capital
TDP
YSRCP
Andhra Pradesh Politics
Sajjala Ramakrishna Reddy

More Telugu News