TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్... శ్రీవాణి ట్రస్టు టికెట్ల విధానంలో మార్పులు
తిరుమల శ్రీవారి ఆన్ లైన్ కరెంటు బుకింగ్‌లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు టికెట్ల జారీ విధానంలో టీటీడీ కీలక మార్పులు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ విధానంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై విరాళం, దర్శనం టికెట్లకు వేర్వేరుగా కాకుండా ఒకే లావాదేవీలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చింది.
గతంలో భక్తులు మొదట రూ.10,000 విరాళం చెల్లించి, ఆ తర్వాత రూ.500 దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఈ ప్రక్రియలో విరాళం చెల్లింపు విజయవంతమైనా, సాంకేతిక కారణాల వల్ల దర్శనం టికెట్ ఖరారయ్యేలోపే కోటా పూర్తవడంతో చాలామంది ఇబ్బంది పడేవారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ, విరాళం రూ.10,000, టికెట్ ధర రూ.500 కలిపి మొత్తం రూ.10,500 ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది.
ఆన్లైన్ కరెంట్ బుకింగ్ కోటా కింద టీటీడీ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు 800 శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తుంది. భక్తులు ఒకే లావాదేవీలో గరిష్టంగా నాలుగు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ చెల్లింపుల ప్రక్రియ కోసం యూనియన్ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు. ఈ ఆన్లైన్ కరెంట్ బుకింగ్‌తో పాటు, మూడు నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే సౌకర్యం యథావిధిగా కొనసాగుతుంది.