Red Wing: ఏజెన్సీలో కలకలం.. అడవిలో కుప్పకూలిన భారీ మెడికల్ డ్రోన్!
ఏజెన్సీ ప్రాంతంలో భారీ శబ్దంతో ఆకాశం నుంచి ఓ వింత వస్తువు కుప్పకూలడంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం బొయితిలి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదట అది హెలికాప్టర్ లేదా ఏదైనా యుద్ధ విమానం కావొచ్చని ఆందోళన చెందారు. చివరకు అది వైద్య సేవలకు వినియోగించే భారీ డ్రోన్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వం ‘రెడ్ వింగ్’ అనే సంస్థ సహకారంతో ఏజెన్సీలోని మారుమూల గ్రామాలకు అత్యవసర మందులు చేరవేసేందుకు డ్రోన్ సేవలను పరీక్షిస్తోంది. ఈ ట్రయల్ రన్‌లో భాగంగా వెళ్లిన డ్రోన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో దట్టమైన చెట్లపై కూలిపోయింది. ఈ డ్రోన్ సాధారణ డ్రోన్‌ల కంటే చాలా పెద్దదిగా, మినీ హెలికాప్టర్ ఆకారంలో ఉండటంతో గిరిజనులు మొదట అయోమయానికి గురయ్యారు.
ఈ వింత వస్తువు కూలిపోయిందన్న వార్త తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రోన్ జనసంచారంలేని ప్రాంతంలో పడటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, అది తమ ఇళ్లపై పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న కంపెనీ ప్రతినిధులు అక్కడికి చేరుకుని డ్రోన్ శకలాలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ట్రయల్ రన్స్‌లో ఇది సహజమేనని వారు వివరించారు. అత్యాధునిక టెక్నాలజీ వాడటం మంచిదే అయినా, భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.