నా చేయి పట్టుకున్న పసివాడు.. ఎందరికో స్ఫూర్తిగా ఎదిగాడు: చరణ్‌పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒకప్పుడు తన చేయి పట్టుకుని నడిచిన పసివాడు, ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలవడం చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు.
"చరణ్ బాబు… చిన్నప్పుడు నా చేయి పట్టుకున్నది మొదలు, ఈరోజు ఎందరికో స్ఫూర్తిగా ఎదిగే వరకు.. నువ్వు నన్ను నిజంగా గర్వపడేలా చేశావు" అని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. "సినిమా, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసే విధానం, కుటుంబం పట్ల నీ బాధ్యత, దేవుడిపై నీకున్న విశ్వాసం, క్రమశిక్షణ, విలువలు.. ఇవన్నీ చూసిన ప్రతిసారి నీపై నా ప్రేమ, అభిమానం మరింత పెరుగుతూనే ఉన్నాయి. దేవుడి ఆశీస్సులు, అభిమానుల ప్రేమ నిన్ను ఎల్లప్పుడూ ఉన్నత శిఖరాలకు చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ రామ్ చరణ్" అంటూ చిరంజీవి తన కుమారుడిని ఆశీర్వదించారు.
సోదరుడికి విషెస్ తెలిపిన సుస్మిత కొణిదెల, అన్నా కొణిదెల
చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు కూడా రామ్ చరణ్‌కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. చరణ్ సోదరి, నిర్మాత సుస్మిత కొణిదెల తన సోదరుడిపై ప్రేమను చాటుకున్నారు. "అతడే మా బలం. అతడే మా గర్వం. అతడే మా ప్రేమ. నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు అతనికి అన్నీ ఇవ్వాలి" అని పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల కూడా చరణ్‌కు విషెస్ చెబుతూ.. "చరణ్ అన్నకు మా అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ విజయవంతంగా, బలంగా ఉండాలి" అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.
మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం 'పెద్ది' నుంచి మేకర్స్ ఓ స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'పెద్ది పహిల్వాన్ గ్లింప్స్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో, రామ్ చరణ్ పక్కా దేహదారుఢ్యంతో ఉన్న రెజ్లర్‌గా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.