Nara Lokesh: వడ్డెర్లకు మైనింగ్ లీజులు... మరో యువగళం హామీ నెరవేర్చిన లోకేశ్
రాష్ట్రంలోని వడ్డెర సామాజికవర్గ అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. వారి కులవృత్తిని ప్రోత్సహించి, ఆర్థికంగా చేయూతనిచ్చే లక్ష్యంతో వడ్డెర కో-ఆపరేటివ్ సొసైటీలకు ప్రభుత్వ కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కేటాయించాలని నేడు ఏపీ క్యాబినెట్ మంత్రివర్గం నిర్ణయించింది. మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తన యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పలుచోట్ల వడ్డెర సామాజికవర్గానికి చెందిన సోదరులు ఆయన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కులవృత్తి అయిన రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే తమకు జీవనోపాధి లభిస్తుందని విన్నవించారు. వారి వినతికి సానుకూలంగా స్పందించిన లోకేశ్, తాము అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తామని అప్పట్లో భరోసా ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం, ఇటీవలి కేబినెట్ సమావేశంలో మంత్రి లోకేశ్ ఈ అంశాన్ని ప్రతిపాదనగా తీసుకువచ్చారు. వడ్డెర సోదరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. ఈ ప్రతిపాదనపై నేడు సమగ్రంగా చర్చించిన మంత్రివర్గం, వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు, విధివిధానాలతో త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) జారీ చేయనుంది.
యువగళం పాదయాత్రలో ప్రతిరోజూ వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను లోకేశ్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, పాదయాత్రలో వివిధ సామాజికవర్గాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది వడ్డెర కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.