Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం

Nandamuri Balakrishna Honored with Lifetime Achievement Award
Advertisement
  • నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం
  • ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం
  • ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
  • షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం
Advertisement
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అరుదైన గౌరవం అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రతిష్ఠాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య) పురస్కారం లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ప్రారంభమైన ‘అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

ఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బాలకృష్ణతో పాటు సీనియర్ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలను ప్రకటించారు. ధర్మేంద్ర తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఈ అవార్డును స్వీకరించారు.

ఈ వేడుకలను ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బాలకృష్ణకు ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement
Balakrishna
Nandamuri Balakrishna
Lifetime Achievement Award
IFFD 2026
Delhi Film Festival
Rekha Gupta
Sharmila Tagore
Dharmendra
Hema Malini
Kangana Ranaut

More Telugu News