కేంద్రమంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి తాను పలుమార్లు లేఖ రాశానని ఆయన పేర్కొన్నారు. తనకు భద్రత కల్పించాలని ఆయన లేఖలో అమిత్ షాను కోరారు.
కాగా, రాజాసింగ్‌కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాణహాని తలపెట్టేలా మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. ఈ నెల 27న శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీలోగా రాజాసింగ్‌ను చంపేస్తామంటూ ఆగంతుకులు ఆ లేఖలో హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అమిత్ షాకు లేఖ రాశారు.