నా ఆస్కార్ కల.. త్రివిక్రమ్‌తోనే సాధ్యం: థమన్
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భవిష్యత్తులో తాను కచ్చితంగా ఆస్కార్ అవార్డు సాధిస్తానని, అది కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే సాధ్యమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన థమన్... ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో ఆస్కార్ గెలిచి దారి చూపారని, ఆ తర్వాత రాజమౌళి, కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’తో దాన్ని మన ముందుకు తీసుకొచ్చారని అన్నారు. వారి స్ఫూర్తితోనే తాను కూడా ఆస్కార్ వేదికపై నిలబడాలని కల కంటున్నట్లు తెలిపారు. త్రివిక్రమ్ ఆలోచనా విధానానికి, ఆయన కథలకు ఆస్కార్ స్థాయి ఉందని ప్రశంసించారు.
ముఖ్యంగా త్రివిక్రమ్ వద్ద వందేళ్లపాటు గుర్తుండిపోయేలా ఓ అద్భుతమైన 'రామాయణం' స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, ఆ సినిమాతో తమ ఆస్కార్ కల నెరవేరుతుందనే నమ్మకాన్ని థమన్ వ్యక్తం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొందరు మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం అతిశయోక్తి అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్‌ను తన గురువుగా భావించే థమన్, ఆయనతో కలిసి తన కలను నిజం చేసుకుంటారో లేదో కాలమే నిర్ణయించాలి.