ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
కేవలం ఒక ఫ్రెంచ్ ఫ్రై ముక్క కోసం ఓ వ్యక్తి పక్షి ప్రాణం తీసిన అమానుష ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. తన కుమార్తె తింటున్న ఆహారాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించిందన్న కోపంతో సీగల్ పక్షిని అతి కిరాతకంగా చంపేశాడు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం, జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు అతనికి 8 నెలల జైలు శిక్ష విధించింది.
2024 జులైలో 30 ఏళ్ల ఫ్రాంక్లిన్ జీగ్లర్ తన కుటుంబంతో కలిసి నార్త్ వైల్డ్‌వుడ్ బీచ్‌కు వెళ్లాడు. అక్కడ అతని కుమార్తె ఫ్రెంచ్ ఫ్రైస్ తింటుండగా, ఒక సీగల్ పక్షి దానిని తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన జీగ్లర్, ఆ పక్షిని పట్టుకుని అందరూ చూస్తుండగానే దాని తల నరికి చంపేశాడు. అనంతరం, చనిపోయిన పక్షిని అక్కడి సిబ్బంది వద్దకు తీసుకెళ్లి, చెత్తబుట్టలో వేయడానికి కవర్ అడగడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు కాగా, విచారణ చేపట్టిన కోర్టు అతనికి 263 రోజుల జైలు శిక్ష విధించింది. ఇటీవల శిక్షాకాలం పూర్తి చేసుకుని విడుదలైన జీగ్లర్‌కు అదనంగా 250 డాలర్ల జరిమానా వేసింది. ప్రవర్తన మార్పు కోసం ప్రత్యేక రికవరీ ప్రోగ్రామ్‌లో చేరాలని కూడా ఆదేశించింది.
అయితే, ఈ తీర్పుపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు, పిల్లల ముందు ఒక మూగజీవిని అత్యంత క్రూరంగా చంపిన వ్యక్తికి ఈ శిక్ష చాలా తక్కువని వారు వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక పక్షిపై జరిగిన దాడి కాదని, సమాజంలో పెరిగిపోతున్న హింసా ప్రవృత్తికి నిదర్శనమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.