కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి
గల్ఫ్ దేశాల్లోని కీలక చమురు సదుపాయాలపై ఇరాన్ దాడులు ఉద్ధృతం చేసింది. కువైట్‌లో కీలకమైన మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడికి పాల్పడింది. ఇటీవల ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రం, సౌదీ అరేబియాలోని అరామ్‌కో చమురుక్షేత్రంపై ఇరాన్ దాడులు చేసింది. రంజాన్ పండుగ తరుణంలో ఈ దాడి జరిగింది.
పశ్చిమాసియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలలో ఈ మినా అల్ అహ్మదీ కూడా ఒకటి. డ్రోన్ దాడి నేపథ్యంలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. అధికారులు వాటిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దాడి నేపథ్యంలో ఎవరైనా గాయపడ్డారా, ఆస్తి నష్టం ఎంత అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రిఫైనరీ నిత్యం 7,30,000 బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తుంది.
మరోవైపు, దుబాయ్ నగరం పైకి ఇరాన్ భారీ స్థాయిలో డ్రోన్లు ప్రయోగించింది. దుబాయ్ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో భారీ పేలుళ్లు వినిపించాయి. తమపై దూసుకొచ్చిన ఒక క్షిపణిని అడ్డుకున్నట్లు బహ్రెయిన్ తెలిపింది. క్షిపణి శకలాలు పడటంతో ఓ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి.