'ధురంధర్ 2' కలెక్షన్ల సునామీ.. తొలిరోజే అన్ని రికార్డులు బద్దలు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే భారత సినీ పరిశ్రమలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ట్రేడ్ వర్గాల అంచనాలను మించి, ఈ సినిమా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు రూ.146 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ద్వారా ఎన్నో భారీ చిత్రాల రికార్డులను ఇది అధిగమించింది.
‘ధురంధర్ 2’ ప్రభంజనం బుధవారం సాయంత్రం వేసిన ప్రీమియర్ షోలతోనే మొదలైంది. ప్రీమియర్ల ద్వారానే ఈ చిత్రం ఇండియాలో దాదాపు రూ.43 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. భారతీయ సినిమాలో ప్రీమియర్ల ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది సరికొత్త రికార్డు నెలకొల్పింది.
తొలిరోజే 100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమా
ఇక మొదటి రోజు వసూళ్లలో హిందీ వెర్షన్ నుంచే రూ.103 కోట్లకు పైగా రాబట్టింది. తద్వారా ఫస్ట్ డేనే రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి హిందీ సినిమాగా బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనర్లుగా ఉన్న 'జవాన్', 'పఠాన్', 'యానిమల్' వంటి చిత్రాల రికార్డులను 'ధురంధర్ 2' బద్దలు కొట్టింది.
'బాహుబలి 2', ‘ఆర్ఆర్ఆర్’ను దాటేసిన 'ధురంధర్ 2'
కేవలం హిందీలోనే కాకుండా ఆల్ ఇండియా స్థాయిలో కూడా ఈ చిత్రం తన సత్తా చాటింది. మొదటి రోజు వసూళ్లలో ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ల రికార్డులను కూడా 'ధురంధర్ 2' అధిగమించడం విశేషం. అన్ని భాషల్లో కలిపి చూసుకుంటే దేశంలో 'పుష్ప 2' తర్వాత రెండో అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. దక్షిణాదిలో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ తొలిరోజే రూ.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, తమిళంలోనూ మంచి ఆదరణ దక్కించుకుంటోంది.
డైరెక్టర్ ఆదిత్య ధర్ టేకింగ్, రణ్‌వీర్ సింగ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. సినిమాలో కీలక పాత్రలు పోషించిన ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ల నటన సినిమా స్థాయిని మరింత పెంచింది. మొదటి భాగం విజయం సాధించిన నేపథ్యంలో 'ధురంధర్ 2' కూడా అదే జోరుతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త బెంచ్‌మార్కులు సెట్ చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.