'ఉస్తాద్'కు పాజిటివ్ టాక్... పవన్ కల్యాణ్ ను కలిసిన చిత్రయూనిట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం ఉగాది పర్వదినం సందర్భంగా నేడు (మార్చి 19) థియేటర్లలో విడుదలైంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. సినిమాకు వస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్ర బృందం ఆనందంతో ఉప్పొంగిపోతోంది.
ఈ సక్సెస్ ఆనందంలో చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ హీరో పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాకు లభిస్తున్న స్పందన గురించి పవన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించిన చిత్ర బృందాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. సినిమాకు హిట్ టాక్ రావడంతో హైదరాబాద్‌లో నిర్మాతలు సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు.