Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉగాది నాడు మా కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది: పవన్ కల్యాణ్ 

Pawan Kalyan Says Alliance Govt Delivered Good News on Ugadi Job Openings
Advertisement
  • 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల
  • గ్రూప్ 1, గ్రూప్ 2 సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
  • నిర్దేశిత సమయంలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పవన్ హామీ
  • గత 20 నెలల్లో 30,607 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడి
Advertisement
ఉగాది పర్వదినాన తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర యువతకు తీపి కబురు చెప్పిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ఆయన ప్రకటించారు. నిర్దేశిత సమయంలోనే ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోందని తెలిపారు. ఈ ఏడాది విడుదల చేసే నోటిఫికేషన్ల ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ వంటి పలు విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.

గత 20 నెలల కాలంలో తమ ప్రభుత్వం 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిందని పవన్ గుర్తుచేశారు. ఇటీవల ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశామని తెలిపారు. తాజా ప్రకటన నేపథ్యంలో ఉద్యోగార్థులు ఏమాత్రం సమయం వృథా చేయకుండా ప్రిపరేషన్‌లో నిమగ్నం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement
Pawan Kalyan
Andhra Pradesh jobs
AP government jobs
Job calendar 2024
Chandrababu Naidu
APPSC Group 1
APPSC Group 2
Teacher jobs
Constable jobs
Government jobs

More Telugu News