Addanki Dayakar: తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం

Addanki Dayakar and Balmoori Venkat Appointed as Government Whips
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను రాష్ట్ర ప్రభుత్వం విప్‌లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఇక, అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విప్‌లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.
Go Back to Shorts
Addanki Dayakar
Telangana MLC
Congress Party
Balmoori Venkat
Telangana Government
Government Whip

More Telugu News