Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడికి రిమాండ్.. చిత్తూరు జిల్లా జైలుకు తరలింపు!
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో భూములకు సంబంధించిన కీలక దస్త్రాల దహనం కేసులో సీఐడీ విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ మునితుకారాం, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిలకు న్యాయస్థానం రిమాండ్ విధించింది.
ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న వీరిద్దరినీ నిన్న సీఐడీ పోలీసులు గాదంకి టోల్‌ప్లాజా వద్ద చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు నిందితులను ప్రత్యేక సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనలు విన్న ఇన్‌ఛార్జి జడ్జి, నిందితులకు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు వారిని చిత్తూరు జిల్లా జైలుకు తరలించారు.