AB de Villiers: టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పిన డివిలియర్స్

AB de Villiers Picks Jasprit Bumrah as T20 GOAT
షార్ట్స్‌లో చూడండి

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు (GOAT) ఎవరనే చర్చకు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒక ఆసక్తికరమైన ముగింపు ఇచ్చాడు. తనతో పాటు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ వంటి దిగ్గజ బ్యాటర్లు రేసులో ఉన్నప్పటికీ, డివిలియర్స్ మాత్రం ఒక బౌలర్‌ను ఎంచుకోవడం విశేషం.


డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం, టీ20 చరిత్రలో జస్‌ప్రీత్ బుమ్రా అత్యుత్తమ ఆటగాడు. ఈ ఎంపిక వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ... "కొత్త బంతి అయినా, పాత బంతి అయినా, ఆఖరికి సూపర్ ఓవర్ అయినా సరే.. బుమ్రా చేతికి బంతి ఇస్తే మ్యాచ్ గెలిపిస్తాడు. ఏ సమయంలోనైనా వికెట్లు తీయగల అతని నిలకడ అమోఘం" అని కొనియాడాడు. "కానీ అతను నాకు బౌలింగ్ చేయనంత వరకు మాత్రమే.." అంటూ చమత్కరించారు.


మరోవైపు, పాకిస్థాన్ సెలెక్టర్, మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీశాయి. బుమ్రా బౌలింగ్ యాక్షన్ భిన్నంగా ఉండటం వల్లే బ్యాటర్లకు లయ దొరకదని చెబుతూ.. బుమ్రాను మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చారు. "ఫాస్ట్ బౌలింగ్‌లో బుమ్రా ఒక ఉస్మాన్ తారిఖ్ లాంటివాడు" అని ఆయన అనడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రపంచ స్థాయి పేసర్‌ను ఒక సాధారణ స్పిన్నర్‌తో పోల్చడమేంటని నెటిజన్లు ఆకిబ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

Go Back to Shorts
AB de Villiers
T20 cricket
Jasprit Bumrah
Virat Kohli
Chris Gayle
Greatest of All Time
GOAT
cricket
Akib Javed
Usman Tariq

More Telugu News