ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!
ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్ 2026) వేడుక అట్టహాసంగా ముగిసింది. ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదే చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, ఇందులో నటనకు గాను సీన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు.
‘సినర్స్’ చిత్రంలో అద్భుత నటనకు మైఖేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా నిలవగా, ‘హామ్నెట్’ చిత్రానికి గాను జెస్సీ బక్లీ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ‘వెపన్స్’ చిత్రంలో నటనకు అమీ మడిగాన్ ఉత్తమ సహాయ నటిగా ఎంపికయ్యారు. ఈసారి పలు చిత్రాలకు అవార్డులు పంచుతూ జ్యూరీ సమ ప్రాధాన్యతనిచ్చింది. ‘సినర్స్’ చిత్రం ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఒరిజనల్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటి విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. మరోవైపు ‘ఫ్రాంకెన్‌స్టైన్’ చిత్రం ప్రొడక్షన్ డిజైన్, మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో మూడు అవార్డులను సొంతం చేసుకుంది.
వివిధ కేటగిరీల్లో విజేతల పూర్తి జాబితా
ఉత్తమ చిత్రం: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ నటుడు: మైఖేల్ బి జోర్డాన్ (సినర్స్)
ఉత్తమ నటి: జెస్సీ బక్లీ (హామ్నెట్)
ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సహాయ నటి: అమీ మడిగాన్ (వెపన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: KPop డెమన్ హంటర్స్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్: సెంటిమెంటల్ వ్యాల్యూ
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: మిస్టర్ నోబడీ ఎగైనెస్ట్ పుతిన్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ర్యాన్ కూగ్లర్ (సినర్స్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ (KPop డెమన్ హంటర్స్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్: లుడ్విగ్ గొరాన్సన్ (సినర్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటం డురాల్డ్ అర్కపా (సినర్స్)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఆండీ జుర్గేన్‌సెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)
ఉత్తమ సౌండ్: F1
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ఫైర్ అండ్ యాష్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైన్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఫ్రాంకెన్‌స్టైన్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్: ఫ్రాంకెన్‌స్టైన్
ఉత్తమ కాస్టింగ్: వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది గర్ల్ హూ క్రైడ్ పెర్ల్స్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ఆల్ ది ఎంప్టీ రూమ్స్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది సింగర్స్ (సంయుక్తం), టూ పీపుల్ ఎక్స్‌ఛేంజింగ్ సలైవా (సంయుక్తం)
ఈసారి లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలు సంయుక్తంగా అవార్డును పంచుకోవడం విశేషం. ఈ అవార్డుల ప్రదానోత్సవంతో 2026 ఆస్కార్ వేడుకలు ఘనంగా ముగిశాయి.