Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి.. దర్శకుడి సంచలన ఆరోపణలు

Monalisa Bhonsle Marriage a Conspiracy Claims Director
Advertisement
  • నటి మోనాలిసా భోంస్లే వయసుపై విచారణ జరపాలని సనోజ్ మిశ్రా డిమాండ్
  • మహాకుంభ్ సమయంలో ఆమె వయసు 16 ఏళ్లేనని, ఆమె మైనర్ అని ఆరోపణ
  • తన సినిమాను అడ్డుకునే కుట్రలో భాగంగానే పెళ్లి జరిగిందని వెల్లడి
  • మైనర్ అని తేలితే ఆమె భర్త ఫర్మాన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Advertisement
'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాతో తాను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్న నటి మోనాలిసా భోంస్లే వయసుపై ఫిల్మ్ మేకర్ సనోజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మైనర్ అని, ఆమె వయసుపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇటీవల మోనాలిసా వివాహం చేసుకోవడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

ఈ విషయంపై సనోజ్ మిశ్రా మాట్లాడుతూ.. మహాకుంభ్ సమయంలో మోనాలిసా వయసు సుమారు 16 సంవత్సరాలేనని, పెళ్లి కోసం ఆమె వయసు పత్రాలను తారుమారు చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. "మోనాలిసా అసలు వయసును నిర్ధారించేందుకు మెడికల్ పరీక్షలు జరపాలని డిమాండ్ చేసేందుకు నేను మహేశ్వర్ వెళ్లి ఆమె కుటుంబాన్ని కలుస్తాను" అని ఆయన తెలిపారు.

ఈ పెళ్లి తన సినిమా ప్రాజెక్టును దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర అని సనోజ్ మిశ్రా ఆరోపించారు. మోనాలిసా తన సినిమాలో నటించకుండా ఉండేందుకే కొన్ని బృందాలు ఈ పెళ్లిని జరిపించాయని ఆయన అన్నారు.

ఒకవేళ వైద్య పరీక్షల్లో మోనాలిసా మైనర్ అని తేలితే, ఆమె భర్త ఫర్మాన్‌తో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతరులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని కేరళలో వివాహం చేసుకుంది. అయితే, జనవరిలోనే ఆమెకు 18 ఏళ్లు నిండాయని కుటుంబ సభ్యులు, పోలీసులు చెబుతున్న నేపథ్యంలో దర్శకుడి ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
Advertisement
Monalisa Bhonsle
The Diary of Manipur
Sanoj Mishra
Farman Khan
Movie Controversy
Age Dispute
Film Director Allegations
Marriage Conspiracy
Bollywood News
Minor Marriage

More Telugu News