సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు
- పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్పై ఎన్ఎస్ఏ నిర్బంధం ఎత్తివేత
- విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
- లడఖ్‌లో హింసను ప్రేరేపించారనే ఆరోపణలతో అరెస్ట్
- దాదాపు ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్
లడఖ్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు భారీ ఊరట లభించింది. ఆయనపై విధించిన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధాన్ని రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. త్వరలోనే ఆయన విడుదల కానున్నారు. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ వెల్లడించింది.
గతేడాది లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 24న జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, భద్రతా సిబ్బందితో సహా సుమారు 50 మంది గాయపడ్డారు.
ఈ హింస జరిగిన రెండు రోజుల తర్వాత సోనమ్ వాంగ్చుక్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో ప్రజలను హింసకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేసి నిర్బంధంలో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు ఆరు నెలలుగా ఆయన నిర్బంధంలోనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ ఆయన నిర్బంధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.