ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్‌జే దొర కన్నుమూత
- కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న హెచ్‌జే దొర
- హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్
- ఇవాళ డయాలసిస్ చేయించుకుని ఇంటికి వెళ్లాక తీవ్ర అస్వస్థత
- నిమ్స్ కు తరలించిన కుటుంబ సభ్యులు
- చికిత్స పొందుతూ మృతి
1965 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హెచ్‌జే దొర శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఆయన విశేష సేవలు అందించారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదాన్ని (నక్సలిజం) అణచివేయడంలో కీలక పాత్ర పోషించి గుర్తింపు పొందారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గానూ జాతీయ స్థాయిలో పలు ఉన్నత పదవులు చేపట్టారు. దొర 1996లో డీజీపీగా ప్రమోషన్ పొందారు. ఆయన తన సుదీర్ఘ వృత్తి జీవితానుభవాలతో 'జర్నీ త్రూ టర్బ్యులెంట్ టైమ్స్' పేరుతో ఆత్మకథను కూడా రచించారు.