తమ్ముడి పాటపై అన్నావదినల డ్యాన్స్... వైరలవుతున్న దేవరకొండ ఫ్యామిలీ వీడియో
- ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ-రష్మిక
- తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి డ్యాన్స్ చేసిన కొత్త జంట
- ఆనంద్ కొత్త సినిమాలోని ‘సంచారమే’ పాటకు ముగ్గురి స్టెప్పులు
- సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దేవరకొండ ఫ్యామిలీ వీడియో
- జంటను చూసి మురిసిపోతున్న అభిమానులు, నెటిజన్లు
టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి పనులు, రిసెప్షన్లతో బిజీగా గడిపిన ఈ జంట, ప్రస్తుతం కాస్త రిలాక్స్ అవుతోంది. ఈ క్రమంలో తమ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. విజయ్ సోదరుడు, హీరో ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన ఒక సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొత్త జంట విజయ్-రష్మికతో కలిసి ఆనంద్ దేవరకొండ డ్యాన్స్ చేస్తూ కనిపించారు.
గత నెల ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో విజయ్-రష్మిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం విజయ్ సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం, అభిమానుల కోసం ప్రత్యేక విందు, హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ముగియడంతో ఈ జంట కాస్త విరామం తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ నుంచి విడుదలైన ‘సంచారమే’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా పాప్యులర్ అయింది. ఈ పాటకు సంబంధించిన రీల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ట్రెండీ పాటకు అన్న విజయ్, వదిన రష్మికతో కలిసి ఆనంద్ సరదాగా స్టెప్పులు వేశాడు. ముగ్గురూ కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోను ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోకు ఆనంద్ ఒక చక్కటి క్యాప్షన్ జోడించాడు. "ఇది చూడటానికి కొంచెం గందరగోళంగా ఉన్నా, ఆ క్షణంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మనకు ఇష్టమైన వారితో కలిసి ప్రయాణిస్తూ, డ్యాన్స్ చేయడం కన్నా ఆనందం ఏముంటుంది?" అని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ ఫ్యామిలీ డ్యాన్స్ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు, అభిమానులు ఈ వీడియోపై ప్రేమ కురిపిస్తున్నారు. ‘సూపర్ క్యూట్ ఫ్యామిలీ’, ‘ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి’, ‘ఫ్యామిలీ గోల్స్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.