'ధురంధర్ 2' హిట్ అయితే ద‌క్షిణాది సినిమాలకు దెబ్బే: ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

Entertainment
Advertisement
  • 'ధురంధర్ 2' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ
  • ఈ సినిమా రూ. 2000 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా
  • అలా జరిగితే దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గండి పడుతుందన్న వర్మ
  • సౌత్ సినిమాలు ఇంకా ఓల్డ్ స్కూల్ పద్ధతిలోనే ఉన్నాయని వ్యాఖ్య
  • మొదటి భాగం కంటే రెండో భాగమే పెద్ద హిట్ అవుతుందని జోస్యం
Advertisement
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా రాబోతున్న 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) చిత్రంపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1500 నుంచి రూ. 2000 కోట్ల మధ్య వసూళ్లు సాధిస్తే, ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగులుతుందని ఆయన జోస్యం చెప్పారు.

వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ.. "ధురంధర్ 2 విజయం సాధిస్తే సౌత్ సినిమాలన్నీ పక్కకు వెళ్లిపోతాయని నేను భావిస్తున్నాను. దక్షిణాది చిత్రాలు ఇంకా పాత పద్ధతుల్లోనే రూపొందుతున్నాయి" అని వ్యాఖ్యానించారు. గాల్లో ఎగరడం వంటివి కాకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలో కూడా 'ధురంధర్ 2'ను భారీగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని వర్మ గుర్తుచేశారు.

ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని వర్మ ధీమా వ్యక్తం చేశారు. మొదటి భాగంలోని పాత్రలు, కథతో ప్రేక్షకులు ఇప్పటికే ఎంతో కనెక్ట్ అయ్యారని, కాబట్టి రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారని అన్నారు. బాహుబలి తరహాలోనే ఈ రెండు భాగాలను కలిపి చిత్రీకరించారని, అందుకే ఇది ఫ్రాంచైజీలా కాకుండా ఒకే కథ కొనసాగింపులా ఉంటుందని వివరించారు. మొదటి భాగం కంటే రెండో భాగమే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ram Gopal VarmaRGVDhurandhar 2Ranveer SinghBollywoodSouth Indian CinemaBox Office CollectionMovie ReviewIndian MoviesFilm Industry

More Telugu News

క్యూలైన్లో నిలబడి ఓటు వేసిన హోం మంత్రి అనిత

05 Nov, 15:04

విజువల్ వండర్.. 'రామాయణ'పై రాజమౌళి రివ్యూ

05 Nov, 15:02

పార్లమెంటుకు రండి చర్చిద్దాం.. రాహుల్‌కు అమిత్‌ షా సవాల్‌!

05 Nov, 15:01

వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు

05 Nov, 14:40

పరిషత్ పోలింగ్‌లో ఉద్రిక్తత.. బ్యాలెట్ బాక్సును బద్దలుకొట్టిన వైసీపీ నేతలు!

05 Nov, 14:18

'యు కాంట్ సీ మీ'.. జాన్ సేనా స్టైల్‌లో కివీస్ బ్యాటర్‌ను ఆటపట్టించిన కోహ్లీ.. వీడియో వైరల్!

05 Nov, 14:08

తిరుమల లడ్డూ కేసు విచారణ ఏపీలోనే.. బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

05 Nov, 13:56

ముంబయి ఇండియన్స్‌లో హార్దిక్‌ ఒంటరిగా ఫీలయ్యాడా? అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

05 Nov, 13:53

సీజేపీకి విదేశీ నిధులు.. దేశంలో అశాంతికి కుట్ర: కేంద్రం సంచలన ఆరోపణలు

05 Nov, 13:46

‘ఆర్ఆర్‌ ట్యాక్స్‌’ నిజమే అయితే చర్యలేవి? మోదీ, షాలకు కేటీఆర్‌ ప్రశ్న

05 Nov, 13:37

రావణుడిగా యశ్ విశ్వరూపం.. అద్భుత నటనతో కట్టిపడేసిన రాకింగ్ స్టార్.. రామాయణలో యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు ఫిదా!

05 Nov, 13:20

అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్‌ 2’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

05 Nov, 13:09

రూ.1020 కోట్ల కొకైన్ స్మగ్లింగ్ యత్నం.. టీ కోసం లారీ డ్రైవర్ ఆగడంతో బ‌య‌ట‌ప‌డ్డ‌ కుట్ర!

05 Nov, 13:01

గొడవలతో నష్టపోయేది కార్యకర్తలే.. మేం బాగానే వుంటాం: జేసీ ప్రభాకర్‌రెడ్డి

05 Nov, 12:58

రాత్రి, ఉదయం వేళల్లో గాలిలో కాలుష్యం ఎందుకు పెరుగుతుంది?

05 Nov, 12:56
..More Telugu News