Naga Chaitanya: ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డు.. తెలంగాణ ప్రభుత్వానికి చైతూ స్పెషల్ థాంక్స్
- 'తండేల్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాగచైతన్య
- తెలంగాణ ప్రభుత్వ గద్దర్ ఫిల్మ్ అవార్డు-2025కు ఎంపిక
- ప్రభుత్వానికి, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపిన చైతూ
- జాతీయ సమైక్యతా చిత్రంగానూ పురస్కారం గెలుచుకున్న 'తండేల్'
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 2025 గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో 'తండేల్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన అక్కినేని నాగచైతన్య తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ గౌరవం దక్కడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
"నాకు ఎంతో ప్రత్యేకమైన 'తండేల్' సినిమాకు ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే చిత్రం ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రంగానూ అవార్డు గెలుచుకోవడం థ్రిల్లింగ్గా ఉంది. ఈ గౌరవం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని చైతన్య పేర్కొన్నారు. దర్శకుడు చందూ మొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్తో పాటు కథానాయిక సాయి పల్లవి, సంగీత దర్శకుడు డీఎస్పీ సహా చిత్ర బృందానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాత్రను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు.
ఇప్పటికే నాగచైతన్య తండ్రి, అగ్ర నటుడు నాగార్జున కూడా ఈ అవార్డులపై స్పందించిన విషయం తెలిసిందే. 'తండేల్' చిత్రంలో చైతన్య అద్భుతమైన నటనకు ఈ పురస్కారం సరైన గుర్తింపు అని కొనియాడారు. తన తండ్రి ఏఎన్నార్ పేరిట అవార్డును నెలకొల్పినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏఎన్నార్ అవార్డు గెలుచుకున్న జయసుధకు, ఎన్టీఆర్ అవార్డు అందుకున్న చిరంజీవికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, విప్లవ కవి గద్దర్ స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను ఏర్పాటు చేసింది. 14 ఏళ్ల తర్వాత పునరుద్ధరించిన నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టి గతేడాది నుంచి ప్రదానం చేస్తున్నారు.