ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
- వెలుగుమట్ల బాధితుల కోసం కవిత దీక్ష
- తెల్లవారుజామున చుట్టుముట్టిన 600 మంది పోలీసులు
- అరెస్ట్ చేసినా దీక్ష ఆపబోనన్న కవిత
- బాధితులకు అక్కడే ఇళ్లు ఇవ్వాలని డిమాండ్
- కవితతో పాటు కస్టడీలోకి విశారదన్ మహరాజ్
నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది పోలీసులు ఒక్కసారిగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు. నాయకులందరినీ బలవంతంగా వాహనాల్లో ఎక్కించి హైదరాబాద్‌కు తరలించారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని ఈ సందర్భంగా కవిత మండిపడ్డారు.
పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ తన నిరాహార దీక్ష కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగివచ్చి, కూల్చివేతలు జరిగిన చోటే బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.