K Kavitha: ఆడబిడ్డల కన్నీళ్లు మీకు మంచిది కాదు: ప్రభుత్వానికి కవిత వార్నింగ్

K Kavitha Warns Government Against Upsetting Women
  • ఖమ్మం వెలుగుమట్ల నిర్వాసితులను పరామర్శించిన కవిత
  • టూరిస్ట్‌గా రాలేదు, సమస్య పరిష్కారమయ్యేవరకూ పోరాడతాన‌ని వెల్ల‌డి
  • కూల్చిన చోటే ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వానికి డిమాండ్
  • పేదల పక్షాన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని స్పష్టీకరణ
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతల బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ‌ పరామర్శించారు. ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న మహిళలను చూసి ఆమె చలించిపోయారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఆడబిడ్డల దుఃఖం, వారి కన్నీళ్లు ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.

"నేను టూరిస్ట్‌ను కాదు. మీ సమస్యకు పరిష్కారం చూపేవరకూ ఇక్కడే ఉండి పోరాడతా" అని కవిత బాధితులకు భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్, మంత్రులు తక్షణమే వెలుగుమట్లకు వచ్చి బాధితులతో మాట్లాడి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు పంపడం అన్యాయమని మండిపడ్డారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ దుఃఖాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నాయని ఆమె ఆరోపించారు.

గతంలో బీఆర్ఎస్ వాళ్లు కూడా ఇళ్లు కూల్చడానికి ప్రయత్నాలు చేశారని కవిత అన్నారు. ఎక్కడైతే ఇళ్లు కూల్చివేశారో అక్కడే తిరిగి స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని కవిత స్పష్టం చేశారు.
K Kavitha
K Kavitha MLC
Telangana Jagruthi
Khammam district
Velugumatla
House demolitions
Telangana government
BRS party
Political criticism
K Kavitha news

More Telugu News